సుకుమార్ రైటింగ్స్ లో సిద్ధు జొన్నలగడ్డ !

Published on Feb 7, 2023 7:23 pm IST


డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డకి స్టార్ డమ్ వచ్చింది. ముఖ్యంగా యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అందుకే ప్రస్తుతం ఈ యంగ్ హీరోకి ఫుల్ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా సిద్ధూకు సుకుమార్‌ స్కూల్‌ నుండి పిలుపు వచ్చింది. టిల్లూ స్క్వేర్‌ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ చేయబోతున్న సినిమా ఫిక్స్ అయ్యింది. సుకుమార్‌ ప్రొడక్షన్‌ హౌస్ తో పాటు ఎస్విసీసీ ప్రొడక్షన్ కలయికలో రాబోతున్న ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగుతుంది.

కాగా ఈ సినిమాని వైష్ణవి దర్శకత్వం వహించనున్నారు. ఇక సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం చేస్తున్న టిల్లూ స్క్వేర్‌ విషయానికొస్తే సీక్వెల్ చిత్రానికి కూడా సిద్ధూ క‌థ‌ను అందిస్తున్నాడు. కాగా ఈ సీక్వెల్‌ చిత్రాన్ని కొత్త దర్శకుడు మల్లిక్‌రామ్‌ తెరకెక్కిస్తున్నాడు. గతంలో ఆయన తేజ సజ్జాతో ‘అద్భుతం’ సినిమా తీశాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :