సైమా అవార్డ్స్: ఉత్తమ నటుడిగా మహేశ్‌బాబు..!

Published on Sep 19, 2021 1:42 am IST


సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా-2021) వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు నేడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే కరోనా కారణంగా గత ఏడాది సైమా అవార్డ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా సైమా-2019కి గానూ తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన అవార్డులు ప్రకటించారు.

అయితే ‘మహర్షి’ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అవార్డును అందుకున్నారు. ఈ సినిమా ద్వారానే వంశీ పైడిపల్లి ఉత్తమ దర్శకుడిగా నిలవగా, అల్లరి నరేశ్ ఉత్తమ సహాయ నటుడిగా నిలిచాడు. సైమా ఉత్తమ చిత్రంగా నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ నిలిచింది. “ఓ బేబీ” సినిమాతో ఉత్తమ నటిగా సమంత ఎంపికయ్యింది.

సంబంధిత సమాచారం :