SIIMA 2021: నామినేషన్ల ను అనౌన్స్ చేసిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్!

SIIMA 2021: నామినేషన్ల ను అనౌన్స్ చేసిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్!

Published on Aug 17, 2022 12:10 PM IST

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మరియు అత్యధికంగా వీక్షించబడిన చలనచిత్ర అవార్డుల కార్యక్రమం మరియు దక్షిణ భారత ప్రాంతం అంతటా 50 శాతం టెలివిజన్ రీచ్‌ను పొందుతోంది SIIMA. దక్షిణ భారత సినిమాకు నిజమైన ప్రతిబింబం మరియు గ్లోబల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అభిమానులను దక్షిణ భారత చలనచిత్ర స్టార్స్‌తో కలుపుతుంది.

సీమా ఈవెంట్ యొక్క 10వ ఎడిషన్ 2022 సెప్టెంబర్ 10 మరియు 11 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది. సీమా చైర్‌పర్సన్ బృందా ప్రసాద్ అడుసుమిల్లి 2021 లో 4 దక్షిణ భారత భాషల్లో విడుదలైన చిత్రాలకు సిమా నామినేషన్‌లను ప్రకటించారు. పుష్ప ది రైజ్ (తెలుగు), కర్ణన్ (తమిళం), రాబర్ట్ (కన్నడ) మరియు మిన్నాల్ మురళి (మలయాళం) వారి వారి భాషల్లోని చాలా ప్రసిద్ధ కేటగిరీలలో SIIMA నామినేషన్‌లలో ముందున్నారు.

తెలుగులో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ 12 నామినేషన్లతో ముందంజలో ఉండగా, బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 10 నామినేషన్లతో రెండో స్థానంలో ఉంది. ఉప్పెన, జాతి రత్నాలు ఒక్కొక్కరు 8 నామినేషన్లతో మూడో స్థానాన్ని పంచుకుంటున్నారు.

తమిళంలో ధనుష్ నటించిన మారి సెల్వరాజ్ కర్ణన్ 10 నామినేషన్లతో అగ్రస్థానంలో ఉండగా, డాక్టర్ శివకార్తికేయన్, నెల్సన్ దర్శకత్వం వహించిన 9 నామినేషన్లతో రెండవ స్థానంలో ఉంది. మాస్టర్ మరియు తలైవి ఒక్కొక్కరు 7 నామినేషన్లతో మూడవ స్థానాన్ని పంచుకుంటున్నారు.

కన్నడలో తరుణ్ సుధీర్ హీరోగా దర్శన్ దర్శకత్వంలో రూపొందిన రాబర్ట్ 10 విభాగాల్లో అగ్రస్థానంలో ఉండగా, రాజ్ బి శెట్టి దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన గరుడ గమన వృషభ వాహనం 8 నామినేషన్లతో రెండో స్థానంలో నిలవగా, పునీత్ రాజ్ కుమార్ హీరోగా సంతోష్ దర్శకత్వం వహించిన యువరత్న 7 నామినేషన్లతో మూడో స్థానంలో నిలిచింది.

మలయాళంలో టోవినో థామస్ కథానాయకుడిగా బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మిన్నల్ మురళి 10 నామినేషన్లతో ముందంజలో ఉండగా, దుల్కర్ సల్మాన్ హీరోగా శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో కురుప్ 8 నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచింది. మహేష్ నారాయణ్ దర్శకత్వం వహించిన మాలిక్ మరియు దిలీష్ పోతన్ దర్శకత్వం వహించిన జోజీ చిత్రాలు 6 నామినేషన్లతో మూడవ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లో ఫాహద్ హీరోగా నటించడం జరిగింది.

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు 2021, పుష్ప ది రైజ్, కర్ణన్, మిన్నల్ మురళి, అఖండ, తలైవి, మాస్టర్, మానాడు, సర్పట్ట పరంబరై, ఉప్పెన, రాబర్ట్ మరియు డాక్టర్ వంటి చిత్రాలతో పాటు వాణిజ్యపరమైన విజయాలతో పాటు జాతీయ గుర్తింపును సంపాదించిపెట్టిన ఒక బెంచ్‌మార్క్ సంవత్సరం అని చెప్పాలి. సంబంధిత భాషలు, ఆన్‌లైన్ ఓటింగ్ విధానం ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు. అభిమానులు తమ అభిమాన తారలు మరియు సినిమాలకు www.siima.in మరియు SIIMA యొక్క Facebook పేజీలో ఓటు వేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు