ట్రైలర్ టాక్ : ఎవరు చావు అయినా ‘సికిందర్’ పిలిస్తేనే.

Sikandar
హీరోఇజం, యాక్షన్, బ్రదర్ సెంటిమెంట్, లవ్, గ్లామర్ ప్రతి పాయింట్ టచ్ చేశాడు ‘సికిందర్’. మరో వారం రోజులలో విడుదల కానున్న సూర్య, సమంత నటించిన ‘సికిందర్’ మూవీ ట్రైలర్ ఈ రోజు విడుదల చేశారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగా ఉంది. ఈ సినిమాలో రాజు, కృష్ణగా సూర్య డ్యూయల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లో అందరిని సర్ ప్రైజ్ చేసిన క్యారెక్టర్ కృష్ణ. ముంబై మాఫియాలో జీవిస్తున్న తన అన్నయ్యను వెతుకుతూ వచ్చే పాత్రలో కృష్ణ కనిపించాడు. ట్రైలర్ మొత్తం అతనిపై కట్ చేశారు.

రెండున్నర నిముషాల ట్రైలర్.. ‘సికిందర్’ సినిమా ఒక పక్కా కమర్షియల్ సినిమా అనే భరోసా అభిమానులకు కలిగించింది. ట్రైలర్ విడుదలకు ముందు హాట్ హాట్ ఫోటోలతో పిచ్చేక్కించిన సమంత, ట్రైలర్లో స్వీట్, క్యూట్ లుక్స్, ఇన్నోసెంట్ ఎక్స్ ప్రేషన్స్ తో ఆకట్టుకుంది. ‘నా చావు అయినా నేనే పిలిస్తేనే వస్తుంది. నీ చావు అయినా నేను పిలిస్తేనే వస్తుంది’ అంటూ పంచ్ డైలాగులతో సూర్య మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సూర్య, సమంతల కాస్ట్యూమ్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి.

యువన్ శంకర్ రాజా సంగీతం, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, లింగుస్వామి దర్శకత్వం ట్రైలర్ ను టాప్ రేంజ్లో నిలబెట్టాయి. చివరగా హీరో ఫ్రెండ్ పాత్రలో విద్యుత్ జమాల్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

 

‘సికిందర్’ ట్రైలర్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Exit mobile version