సింహం సింగిల్ గా వస్తుంది.

sikindar

తమిళ, తెలుగు ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన స్టార్ హీరో ‘సింగం’ సూర్య ఆగస్ట్ 15న సింగిల్ గా వస్తున్నాడు. ‘సికిందర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఆ రోజునే. బాక్సాఫీస్ బరిలో అతనికి పెద్దగా పోటి ఇచ్చే సినిమాలు లేవు. మొదట ఎన్టీఆర్ ‘రభస’ను ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. దాంతో సూర్య ‘సికిందర్’ సినిమాకు లైన్ క్లియర్ అయిపొయింది. సుమంత్ అశ్విన్, నందిత జంటగా నటించిన ‘లవర్స్’ సినిమా మాత్రమె ఆగస్ట్ 15న విడుదల అవుతుంది. ఈ సినిమా ‘సికిందర్’పై ప్రభావం చూపే అవకాశం లేదు. అలాగే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో సందడి చేస్తున్న సినిమాలు లో బడ్జెట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ కావడంతో మాస్ మసాలా కమర్షియల్ సినిమా కొరత ఏర్పడింది. సూర్య ‘సికిందర్’ ఆ లోటు తీరుస్తుందని భావిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా సూర్యకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో క్రేజ్ ఉంది. లింగుస్వామి డబ్బింగ్ సినిమాలు తెలుగులో హిట్ అవ్వడం, సమంత హీరోయిన్ కావడంతో ‘సికిందర్’పై తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. హిట్ టాక్ వస్తే సినిమా కలెక్షన్స్ కుమ్ముకోవడం ఖాయం. మరో పెద్ద సినిమా పోటిలో లేకపోవడం కలసివస్తుంది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ తెలుగులో విడుదల చేస్తున్నారు.

Exit mobile version