“గాడ్ ఫాథర్” విషయంలో సిల్లీ కంపారిజాన్స్..!

Published on Sep 29, 2022 3:30 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ లో సాలిడ్ హైప్ ని నెలకొల్పుకొని రిలీజ్ కి వస్తున్న మరో అవైటెడ్ చిత్రం “గాడ్ ఫాథర్”. మెగాస్టార్ చిరంజీవి అలాగే సల్మాన్ ఖాన్ లాంటి బిగ్ స్టార్స్ తో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సాలిడ్ మల్టీ స్టారర్ ఈ దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రంపై టీజర్ నుంచి నెక్స్ట్ లెవెల్ అంచనాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు ఓ రీమేక్ అని ఎక్కడో కాస్త నెగిటివ్ ఉన్నా కూడా టీజర్ తర్వాత నుంచి అయితే అంచనాలు తలకిందులు అయ్యాయని చెప్పాలి.

ఇక ఫైనల్ గా ట్రైలర్ ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్న వారికి నిన్ననే ట్రైలర్ కూడా వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్ వచ్చాక అయితే ఒరిజినల్ తో కొంతమంది పోల్చడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఓ సీన్ లో మోహన్ లాల్ మరియు మెగాస్టార్ తో కలిపి కంపేర్ చేస్తూ కొందరు సిల్లీగా మారుస్తున్నారు. దీనితో సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం ఇదే నడుస్తుండగా మెగా ఫ్యాన్స్ కూడా గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు.

సంబంధిత సమాచారం :