తన కొత్త చిత్రం కోసం 15 కేజీల వెయిట్ తగ్గిన శింబు!

Published on Aug 13, 2021 8:28 pm IST

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం లో శింబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వెందు తానిందు కాదు. ఈ చిత్రం లో శింబు చాలా డిఫెరెంట్ లుక్ లో కనిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటుగా ఫస్ట్ లుక్ విడుదల అయిన సంగతి తెలిసిందే. శింబు మొదటి సారిగా డిఫెరెంట్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. అయితే ఈ చిత్రం కోసం శింబు 15 కేజీల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. షర్ట్ లేకుండా శింబు కనిపిస్తూ ఉండటం తో అభిమానులు షేర్ చేస్తూ, లైక్స్ కొడుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :