హీరోయిన్ ను పెళ్లి చేసుకునే విషయంపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో !


గత కొన్ని రోజులుగా తమిళ మీడియాలో స్టార్ హీరో శింబు పెళ్లి విషయం హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెల్సిందే. బిగ్ బాస్ షోతో మరింతగా పాపులర్ అయిన నటి ఒవియాను తాను పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నానని శింబు పేరుతో ఉన్న ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ నుండి ట్వీట్స్ వెలువడ్డాయి. అవి కాస్త పెద్ద హంగామాగా మారాయి. పలు మీడియా చానెళ్లు కూడా అవి వాస్తమేనన్నట్టు కథనాలు ప్రచురించాయి. దీంతో స్వయంగా శింబు స్పందించాల్సి వచ్చింది.

శింబు క్లారిటీ ఇస్తూ ‘ఇదెవరో కావాలని క్రియేట్ చేసిన తప్పుడు వార్త. నాపై ఇలాంటి రూమర్స్ రావడం కొత్తేమీ కాదు. అలాంటివి ఎన్నో చూశాను. కానీ మీడియా కూడా నిజమేమిటో తెలుసుకోకుండా వాటిని నిజమని ప్రచారం చేయడం బాగోలేదు. అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే. ఇకపై మీడియా నా నుండి, నా నిజమైన అకౌంట్స్ నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రచురించాలని, ఎవరో కావాలని ప్రచారం చేసే అవాస్తవాల్ని కాదని మనవి చేసుకుంటున్నాను’ అన్నారు.