సినిమా కోసం 27 కిలోలు తగ్గిన హీరో !

Published on Nov 21, 2021 11:39 pm IST

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా వస్తోన్న సినిమా ‘లూప్‌’. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శింబు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సినిమాకి ముందు నా కెరీర్‌ చాలా డౌన్ లో ఉంది. అందుకే ఈ సినిమా కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. ముఖ్యంగా నన్ను నేను మార్చుకోవాలని 27 కిలోలు తగ్గాను.

ఆహార అలవాట్లు దగ్గర నుంచి మద్యపానం వరకు అన్ని విషయాల్లో చాలా నిబద్దతతో ఉన్నాను. అందుకే ఈ సినిమాలో నేను కొత్తగా కనిపిస్తాను. అన్నట్టు ఇక పై నా ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేస్తాను. అలాగే మంచి కథ కుదిరితే తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయాలనుకుంటున్నాను. ది లూప్‌’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న అల్లు అరవింద్‌ గారికి, బన్నీ వాసుకు కృతజ్ఞతలు’ అంటూ శింబు చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :