డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ “అధర్వ” నుంచి సిమ్రాన్ చౌదరి ఫస్ట్ లుక్ రిలీజ్!

Published on Sep 26, 2022 1:05 pm IST

యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా అధర్వ. షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచే ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించే ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా భారీ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. చిత్రంలో నిత్య అనే పాత్రలో సిమ్రాన్ చౌదరి కనిపించనుందని తెలిపిన యూనిట్, ఈ రోల్ సినిమాలో చాలా కీలకం అని పేర్కొన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మిస్టరీ కేసును ఛేదించడంలో ఆధారాలు వెతుకుతున్నట్లుగా చాలా సీరియస్ లుక్ లో కనిపించింది సిమ్రాన్ చౌదరి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ పోస్టర్ ను విడుదల చేశారు.

రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా విడుదల చేయించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. అలాగే ఈ మూవీ నుంచి హీరోకి సంబంధించిన యాక్షన్ లుక్‌ని రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన సిమ్రాన్ చౌదరీ లుక్ సినిమా పట్ల ఉన్న క్యూరియాసిటీ పెంచేసింది.

డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. ఆయన మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్ అంటున్నారు మేకర్స్. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రైటర్, డైరెక్టర్ మహేష్ రెడ్డి, ప్రొడ్యూసర్ సుభాష్ నూతలపాటి, బ్యానర్ పెగ్గో ఎంటర్టైన్మెంట్స్, సమర్పణ నూతలపాటి నరసింహం, అనసూయమ్మ, మ్యూజిక్ శ్రీచరణ్ పాకాల, DOP చరణ్ మాధవనేని, ఎడిటింగ్ SB ఉద్ధవ్, ఆర్ట్ రామ్ కుమార్, లిరిక్స్ కాసర్ల శ్యామ్, కిట్టు విస్సప్రగడ, PRO సాయి సతీష్, పర్వతనేని లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :