‘సింగం 3’ సెన్సార్ రేటింగ్ మారింది..!
Published on Jan 5, 2017 4:24 pm IST

s3
తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోల్లో ఒకరుగా దూసుకుపోతోన్న సూర్య నటించిన ‘సింగం 3’ గత నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా, అనుకోని కారణాల రీత్యా జనవరి 26కు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానులంతా నిరాశపడ్డారు. అయినప్పటికీ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎక్కడా తగ్గదని టీమ్ చెబుతూ వస్తోంది. ఇక ఈ సినిమా సెన్సార్ విషయంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మొదట ఈ సినిమా తమిళ వర్షన్‌కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారట. అయితే తమిళనాడు ప్రభుత్వం అందించే ట్యాక్స్ మినహాయింపు కోసం టీమ్, కొన్ని మార్పులతో మరోసారి సెన్సార్‌ను సంప్రదించగా, ఈసారి యూ సర్టిఫికెట్ వచ్చింది. మాస్ దర్శకుడు హరి తెరకెక్కించిన ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్‌లు హీరోయిన్లుగా నటించారు. సింగం సిరీస్‌లో వచ్చిన గత చిత్రాల్లానే మాస్ యాక్షన్ అంశాలతో సింగం 3 మెప్పించనుంది.

 
Like us on Facebook