అఖిల్ సినిమాతో బిగ్ స్క్రీన్ పైకి వస్తున్న సింగర్ చిన్మయి.!

Published on Sep 10, 2021 8:45 am IST

అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని హీరోగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” కోసం అందరికీ తెలిసిందే. ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. మన టాలీవుడ్ కి చెందిన బ్యూటిఫుల్ ఫీమేల్ వాయిస్ సింగర్ చిన్మయి ఈ సినిమాలో నటిస్తున్నారని కన్ఫర్మ్ చేశారు.

ఈరోజు వినాయక చవితి సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడి చేశారు. ఈ చిత్రం ద్వారా చిన్మయి మొట్టమొదటి సారిగా నటిగా బిగ్ స్క్రీన్ పైకి పరిచయం అవుతుంది. మరి ఈ సినిమాలో తాను ఎలాంటి రోల్ కనిపించనుందో అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందివ్వగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :