మానసికంగా అప్పుడు చాలా బాధపడ్డాను – చిన్మయి

Published on Aug 20, 2022 10:37 pm IST

గాయనీగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ‘చిన్మయి శ్రీపాద’ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగానే ఆమె పై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా ఈ గాయని అలా జరిగేసరికే చాలా డిస్ట్రబ్‌ అయ్యాను అంటూ తన ప్రగ్నెన్సీపై పలు విషయాలను పంచుకున్నారు. చిన్మయి ఇటీవలే పండంటి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా చిన్మయి తన ప్రగ్నెన్సీ గురించి చెబుతూ.. పేరెంట్స్ అవ్వాలని అనుకున్నా.. కరోనా కారణంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత గర్భం దాల్చగా మూడునెలలకే అబార్షన్ అయింది. ఆ సమయంలో చాలా స్ట్రగుల్ అయ్యాను. మానసికంగా కూడా అప్పుడు చాలా బాధపడ్డాను అని చిన్మయి చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని చిన్మయి తన స్వంత యూట్యూబ్‌ ఛానల్‌లో పంచుకుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :