ప్రముఖ పాటల రచయిత శస్త్ర చికిత్సకు సింగర్ స్మిత భారీ సాయం..!

Published on Oct 29, 2021 12:57 am IST

టాలీవుడ్ హిట్ సినిమాలైన “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు, ఇడియట్, చిరుత, టెంపర్ వంటి పలు సినిమాలకు పాటలు రాసిన ప్రముఖ గేయ రచయిత కందికొండ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఎన్నో పాటలు, ఎన్నో మెలోడీ, మాస్ సాంగ్స్‌ని అందిస్తూ వస్తున్న కందికొండను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినట్టు తెలుస్తుంది.

అయితే చికిత్స నిమిత్తం భారీగా ఖర్చు అవుతుండడంతో ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అయితే రేపు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు వెన్ను భాగంలో సర్జరీ జరగనుంది. కాగా ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సింగర్ స్మిత కందికొండ శస్త్ర చికిత్స కోసం అయ్యే ఖర్చులో భారీ మొత్తంలో ఆమె వైపు నుంచి సాయం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే కరోనా సమయంలో కూడా సింగర్ స్మిత పలు సేవా కార్యక్రమాలను చేపట్టి పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :