సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘కొత్త మలుపు’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తధాస్తు క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భైరవి అర్థ్యా (Bhairavi Ardhya) హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. శివ వరప్రసాద్ కేశనకుర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు.
పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం రొమాంటిక్ లవ్, సస్పెన్స్ మరియు కామెడీ అంశాల మేళవింపుగా ఉండబోతోంది. ఇందులో ఆకాష్, భైరవి బావా-మరదళ్లుగా కనిపిస్తారని, వారి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. రఘు బాబు, పృద్వి, ప్రభావతి వంటి సీనియర్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పల్లెటూరి వాతావరణంలో సహజత్వానికి దగ్గరగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు నిర్మాత పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభిస్తోందని, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.
