ప్రముఖ సింగర్ పై రూమర్స్ !
Published on Nov 4, 2017 11:16 am IST

ప్రముఖ గాయని పి.సుశీల అందరికి సుపరిచితమే. ఆమె గొంతు గుర్తు పట్టని వారు ఉండరు. ఈ మద్య తమిళ్ మీడియాలో ఆమెపై వధంతులు వినిపించాయి. ఆమె ఆరోగ్యం క్షీణించిందంటూ కొందరు, ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందని మరికొందరు వార్తలు రాసారు. తనపై వస్తోన్న వదంతులపై సుశీల స్పందిస్తూ తాను క్షేమంగా ఉన్నట్లు వీడియో సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం తాను అమెరికా పర్యటనలో ఉన్నానని. శనివారం తిరిగి ఇండియాకు వస్తానని ఆమె అందులో చెప్పారు.

భగవంతుడి దయవల్ల తను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు సుశీల. ఇప్పటికే సినీమా పరిశ్రమలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సుశీల తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో 50 వేలకు పైగా పాటలను పాడారు. ఐదు జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకున్న ఘనత ఈమెకు ఉంది.

 
Like us on Facebook