‘సింగం 3’ ఆడియో కూడా వాయిదా పడింది!

singam-3
‘గజిని’ సినిమాతో తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ సూపర్ స్టార్ సూర్యను ఇక్కడా స్టార్‌ను చేసిన సినిమాలు.. ‘సింగం'(యముడు), ‘సింగం 2′(సింగం – యముడు 2). తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌లో మూడో సినిమాయే ‘సింగం 3’. తెలుగులో యముడు 3 పేరుతో వస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 16న విడుదల కావాల్సి ఉండగా, రామ్ చరణ్ నటించిన ధృవకు రెండు వారాల తర్వాత వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో డిసెంబర్ 23కు వాయిదా పడింది.

ఇక సినిమాతో పాటు ఆడియో విడుదలను కూడా వాయిదా వేశారు. మొదట తెలుగు వర్షన్ ఆడియో రిలీజ్‌ను రేపు (డిసెంబర్ 5న) నిర్వహించాలని టీమ్ ప్లాన్ చేసింది. అయితే తాజాగా ఆడియో విడుదల తేదీని కూడా మార్చేసి డిసెంబర్ 11కు ఫిక్స్ చేసింది. 11న హైద్రాబాద్‌లో పెద్ద ఎత్తున జరిగే ఈవెంట్‌లో ఆడియో విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, పోస్టర్స్‌తో ఈ సినిమాకు భారీ క్రేజ్ వచ్చింది. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్‌లు హీరోయిన్లుగా నటించారు. హరీస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు.