పాటల సందడి మొదలు పెట్టనున్న స్టార్ హీరో


తమిళ స్టార్ హీరో అజిత్ చిత్రం ‘వివేగం’ పై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ఫస్ట్ లుక్ తో ఇప్పటికే ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. అజిత్ అభిమానులను ఉత్సాహ పరిచేలా నిన్ననే ఈ చిత్రయూనిట్ ఆడియో టీజర్ ని విడుదల చేసింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని ‘సుర్వివా’ అనే మొదటి పాటని జూన్ 19 న విడుదల చేయనున్నారు. యువ మ్యూజిక్ తరంగం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 11 న విడుదల చేయనున్నారు.టి జి త్యాగరాజన్ ఈ చిత్రానికి నిర్మాత.