అదిరే లెక్కలతో “సార్” లేటెస్ట్ వరల్డ్ వైడ్ వసూళ్లు.!


కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లేటెస్ట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం “సార్”. తెలుగు మరియు తమిళ్ లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ సినిమా ధనుష్ కెరీర్ లో మరో పెద్ద హిట్ దిశగా వెళ్తుంది. అయితే ఈ సినిమా తెలుగులో కూడా అద్భుతమైన వసూళ్లు రాబడుతుండగా వరల్డ్ వైడ్ అయితే ఈ సినిమా ఇప్పుడు మరో మార్క్ ని ఈ సినిమా అందుకుంది.

ఈ చిత్రం అయితే మొత్తం 8 రోజుల్లో 75 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు అధికారికంగా అనౌన్స్ చేశారు. మొత్తానికి అయితే ఈ సినిమా మాత్రం అదిరే రన్ ని కొనసాగిస్తోంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందించగా సముద్రఖని, తనికెళ్ళ భరణి, సుమంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు మరియు ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

Exit mobile version