తెలుగు స్టేట్స్ లో సాలిడ్ వసూళ్లతో “సార్”.!

Published on Feb 19, 2023 12:00 pm IST

కోలీవుడ్ గ్లోబల్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సార్” కోసం తెలిసిందే. మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాతోనే ధనుష్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమాకి తెలుగు ఆడియెన్స్ అదిరిపోయే వెల్కమ్ ని అందించారు. ధనుష్ కెరీర్ లోనే బెస్ట్ వసూళ్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవుతున్నాయి.

మరి ఈ సినిమా రెండు రోజుల్లో 10 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అంతే కాకుండా మొదటి రోజు కన్నా రెండో వసూళ్లు సినిమా సాలిడ్ గా వచ్చాయని తెలుస్తుంది. అలాగే ఇక మూడో రోజు ఆదివారం కూడా సూపర్ వసూళ్లు సార్ కి నమోదు కానున్నాయి.

అలాగే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా సార్ చిత్రం తమిళ్ వెర్షన్ కన్నా తక్కువ లొకేషన్స్ లో ఉన్నప్పటికీ బెటర్ పెర్ఫామెన్స్ ని కనబరుస్తూ ఉండడం మరో విశేషం. మొత్తానికి మాత్రం మేకర్స్ పెట్టుకున్న అన్ని అంచనాలు రీచ్ అయ్యారనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :