ఓటిటిలో అదిరే లెవెల్లో “సార్” డామినేషన్.!

Published on Mar 21, 2023 8:30 pm IST

కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “సార్”. తమిళ్ లో “వాథి” పేరిట ఒకేసారి రిలీజ్ కాగా ఈ సినిమా రెండు భాషల్లో కూడా భారీ హిట్ గా మారడమే కాకుండా ధనుష్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఓటిటి లో రిలీజ్ కూడా అయ్యినప్పటికీ మంచి వసూళ్లు అందుకున్న ఈ సినిమా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అదిరే రెస్పాన్స్ తో డామినేషన్ ని కొనసాగిస్తోంది.

మరి ఈ సినిమా అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫ్లిక్స్ లో ఇండియన్ వైడ్ గా నెంబర్ 1 అలాగే నెంబర్ 2 మరియు 3 స్థానాల్లో కూడా ట్రెండింగ్ లో నిలవడం క్రేజీ గా మారింది. దీనితో ఓటిటి లో సార్ టేకోవర్ మామూలుగా లేదని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :