‘సార్’ ఒక సింపుల్ ఫిలిం విత్ గ్రేట్ ఎమోషన్స్ & గ్రాండ్ మెసేజ్ – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో ధనుష్

Published on Feb 16, 2023 12:08 am IST


ధనుష్, సంయుక్తా మీనన్ హీరో, హీరోయిన్స్ గా యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బైలింగువల్ మూవీ సార్. తమిళ్ లో వాతిగా రిలీజ్ కానున్న ఈ మూవీ పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉండగా ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఎంతో ఆకట్టుకుని ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి అనే చెప్పాలి. ఇక నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో గల పీపుల్స్ ప్లాజా లో ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు యూనిట్ సభ్యులు.

ఇక ఈ ఈవెంట్ లో హీరో ధనుష్ మాట్లాడుతూ, సార్ మూవీ కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారని అన్నారు. ఫస్ట్ టైం సార్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుండడం ఆనందంగా ఉందని, అలానే ఈ ప్రాజక్ట్ విషయమై మొదటి నుండి మమ్మల్ని ప్రోత్సహించిన త్రివిక్రమ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ధనుష్. ఇక సార్ మూవీ ఒక సింపుల్ గా సాగే గ్రేట్ ఎమోషనల్ అండ్ గ్రాండ్ మెసేజ్ ఫిలిం అని అన్నారు. అయితే ఇందులో కావాల్సినంత మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని, ఎక్కడా కూడా కథని ప్రక్క దారి పట్టించకుండా దర్శకుడు వెంకీ విద్యావ్యవస్థపై సంబందించిన పాయింట్ ని అద్భుతంగా తీసారని తెలిపారు.

తెలుగు తనకి పూర్తిగా రాదని, ఈసారి సినిమా చేసే సమయానికి తప్పకుండా తెలుగు నేర్చుకుంటానని అన్నారు. హీరోయిన్ సంయుక్తా మీనన్, హైపర్ ఆది, సాయి కుమార్, సముద్ర ఖని వంటి వారు సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసారని, మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ యువరాజ్, నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తప్పకుండా తమిళ్ తో పాటు తెలుగులో కూడా సార్ మూవీ మంచి సక్సెస్ అందుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు ధనుష్. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 17న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :