ఇంటర్వ్యూ : విఐ – ఆనంద్ – ఫ్లాప్ అయినా కూడ సినిమా చేస్తానని శిరీష్ మాటిచ్చారు

24th, December 2017 - 03:51:35 PM

‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు విఐ. ఆనంద్ చేసిన తాజా చిత్రం ‘ఒక్క క్షణం’. ఈ నెల 28న సినిమా రిలీజవుతున్న సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘ఒక్క క్షణం’ దేని గురించి ?
జ) ఇదొక థ్రిల్లర్. ఇందులో ఫన్, రొమాన్స్ వంటి ఇతర కమర్షియల్ అంశాలను కూడా కలిపి స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. మంచి థ్రిల్లర్. ప్రేమకు, విధికి మధ్య జరిగే పోరాటం. ఏది దేనిని గెలుస్తుంది అనేదే కథ.

ప్ర) ఈ పార్లల్ లైఫ్ అనే కాన్సెప్ట్ హాలీవుడ్లో కూడా ఉన్నట్టుండి ?
జ) ఇలాంటి సినిమా కొరియన్ లో కూడా ఉంది. పార్లల్ లైఫ్ అనేది ఫిక్షన్ కాదు కాన్సెప్ట్. ఎన్నో ఏళ్లుగా దీనిపై రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఆ కాన్సెప్ట్ నుండి తీసిన సినిమా ఇది. ‘ఒక్క క్షణం’ అనేది దీనికీ కాపీ కాదు.

ప్ర) కొత్త కాన్సెప్ట్ కదా తెలుగువారికి నచ్చేలా ఎలా చూపించారు ?
జ) ఇందులో మ్యాచ్ స్టిక్స్ ద్వారా అందరికీ అర్థమయ్యేలా ఈ కాన్సెప్ట్ ను చెప్పడం జరిగింది. ఇందులో ప్రతి సీన్ చాలా వివరంగా ఉంటుంది. అందుకే టీజర్ నుండే కాన్సెప్ట్ ను రివీల్ చేసి ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లేలా చేశాం .

ప్ర) ఇది చాలా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ కదా అందరికీ అర్థమవుతుందా ?
జ) ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక పెద్ద కాన్సెప్ట్ ను తీసుకున్నప్పుడు దాన్ని ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సామాన్య జనానికి కూడా అర్థమయ్యేలా చెప్పాలి. అలాగే ఈ సినిమా ద్వారా ఆ కాన్సెప్ట్ ను చెప్పాను.

ప్ర) ఈ సినిమాకి శిరీష్ గారే ఫస్ట్ ఛాయిసా ?
జ) అదంతా అలా జరిగిపోయింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ సినిమా రిలీజ్ కు ముందు నిర్మాత చక్రికి కథ చెప్పగానే ఆయన కొన్ని రోజులకి శిరీష్ కి కథ చెప్పు అన్నారు. నేను వెళ్లి చెప్పగానే ఆయన ఎగ్జైట్ అయిపోయి ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నారు. ఒకవేళ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫ్లాప్ అయినా కూడా చేస్తామని మాటిచ్చారు.

ప్ర) శిరీష్ ఎలా పెర్ఫార్మ్ చేశారు ?
జ) ఈ సినిమా కోసం ఈయన చాలా కష్టపడ్డారు. ఇప్పటికే ఆయన కొన్ని సినిమాలు చేశారు. కానీ ఇందులో అయన బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూస్తారు. కథలోని జీవ అనే పాత్ర చేయడానికి అయన చాలా హోమ్ వర్క్ చేశారు.

ప్ర) ఇలాంటి డిఫరెంట్ ఐడియాస్ మీకెలా వస్తాయి ?
జ) ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ సినిమా కాన్సెప్ట్ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుండి తీసుకున్నది. అలాగే ‘ఒక్క క్షణం’ కూడా నేను చూసిన ఒక రియల్ లైఫ్ పెర్సన్ నుండి తీసుకున్నదే.