సాయి తేజ్‌ పెళ్లి పై శిరీష్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

Published on Oct 17, 2021 7:20 pm IST

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఇటీవలె రోడ్డు ప్రమాదానికి గురై పూర్తిగా కోలుకొని విజయ దశమి రోజున హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే, అదేరోజు సాయి తేజ్‌ పుట్టిరోజు కూడా కావడం విశేషం. కాగా సాయి తేజ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ మెగా ఫ్యామిలీలోని మెంబర్స్ వీడియో మెసేజ్ లు సెండ్ చేశారు. మెగా కజిన్స్‌ గ్రూప్ లో వెల్‌కం హోం అంటూ తేజ్ కి బర్త్‌ డే విషెస్‌ ను తెలిపారు.

అయితే, ఆ వీడియో మెసేజ్ లను ఒక వీడియోగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిహారిక కొణిదెల. ఈ వీడియోలో సుష్మిత కొణిదెల, శ్రీజ, నిహారిక, అల్లు శిరీష్‌ సహా మిగతా కజిన్స్‌ సైతం తేజ్‌కు పుట్టినరోజు శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంలో అల్లు శిరీష్‌ మాట్లాడుతూ.. సింగిల్‌గా ఇదే నీ చివరి బర్త్‌డే అవ్వాలని కోరుకుంటున్నా. ఈ మ్యారేజ్‌ రేస్‌లో నువ్వు నన్ను బీట్‌ చెయ్యాలనుకుంటున్నాను’ అని సాయి తేజ్‌ పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సంబంధిత సమాచారం :