“పక్కా కమర్షియల్” లో సిరివెన్నెల సీతారామశాస్త్రి స్ఫూర్తి దాయక గీతం…ఫిబ్రవరి 2 న విడుదల

Published on Jan 28, 2022 5:17 pm IST

దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి ఎన్నో స్ఫూర్తి దాయకమైన పాటలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి జాలువారాయి. పది మందిని ప్రభావితం చేసే పాట రాయాలంటే సిరివెన్నెల గారిని మించిన ఆప్షన్ మరొకటి లేదు అని చెప్పాలి. ఆయన కెరీర్లో అలాంటి ఎన్నో అద్భుతమైన ప్రభావవంతమైన పాటలు తెలుగు కళామతల్లికి ప్రేక్షకులకు అందించారు సీతారామశాస్త్రి. అలాంటి లెజెండరీ రైటర్ కలం నుంచి చివరిసారిగా జాలువారిన స్ఫూర్తి దాయక గీతం పక్కా కమర్షియల్ లో ఉంది.

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్ సాంగ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. జనవరి 31 ఈ పాటకు సంబంధించిన గ్లిమ్ప్స్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2 న పూర్తి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది.

“జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు, జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు” అంటూ ఈయన ఒక అందమైన పాట రాశారు. ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ సిరివెన్నెల గారిని గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని, జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్ లో ఉంటాయని మారుతి చెప్పారు. సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారిన చిట్టచివరి స్ఫూర్తిదాయక గీతం ఇదే కావడం గమనార్హం. యువి క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :