“శ్యామ్ సింగరాయ్” నుండి సిరివెన్నెల వీడియో సాంగ్ నేడు విడుదల!

“శ్యామ్ సింగరాయ్” నుండి సిరివెన్నెల వీడియో సాంగ్ నేడు విడుదల!

Published on Dec 28, 2021 12:30 PM IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం కి సంబంధించిన ఒక వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

నేడు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం నుండి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటను నేడు విడుదల చేయనున్నారు. నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా థియేటర్ల లో విజయవంతం గా ప్రదర్శితమవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు