యూత్ ను టార్గెట్ చేస్తూ.. ‘సీత ఆన్ ది రోడ్’ !

sita on the road

ప్రణీత్ యారోన్ దర్శకత్వంలో కల్పిక గణేష్, కటేరా హకిమి, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘సీత ఆన్ ది రోడ్’. ఐదుగురు స్త్రీల బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన నేపథ్యంలో.. తొలి తెలుగు రోడ్ మూవీగా రాబోతుంది ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే హల్ చల్ చేస్తోంది.

కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో ప్రధానంగా బోల్డ్ అంశాలే హైలెట్ అవ్వడం, పైగా అవి అమ్మాయిల చుట్టూ సాగడంతో ట్రైలర్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక కర్ణాటక మరియు గోవా రాష్ట్రాలలో ఎక్కువగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో నేసా ఫర్హదీ మరియు ఉమా లింగయ్య ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Exit mobile version