కృష్ణ లో ”సీత రామం”, “బింబిసార” 6 రోజుల వసూళ్లు వివరాలు.!

Published on Aug 11, 2022 11:56 am IST


రీసెంట్ గా మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరకి వచ్చి సూపర్ హిట్ అయినటువంటి చిత్రాలు “సీతా రామం” మరియు “బింబిసార” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ రెండు చిత్రాలు కూడా అందుకున్న భారీ విజయాలు తెలుగు సినిమాకి కొత్త ఊపిరిని పోశాయి. అలాగే హీరోలు కళ్యాణ్ రామ్ మరియు దుల్కర్ సల్మాన్ ల కెరీర్ లలో కూడా భారీ వసూళ్లు అందుకున్న చిత్రాలుగా సాలిడ్ పెర్ఫామెన్స్ తో దూసుకెళ్తున్నాయి.

ఇక లేటెస్ట్ గా అయితే ఈ రెండు చిత్రాల కృష్ణ జిల్లా వసూళ్ల డీటెయిల్స్ తెలుస్తున్నాయి. కృష్ణ జిల్లాలో సీతా రామం కి 6వ రోజు 7 లక్షల 86 వేలకి పైగా షేర్ వసూలు చేయగా అక్కడ మొత్తం ఈ చిత్రం 82 లక్షల 33 వేలకి పైగా షేర్ ని అందుకుంది. ఇక బింబిసార విషయానికి వస్తే ఈ చిత్రం 6వ రోజు 4 లక్షల 52 వేల షేర్ అందుకోగా మొత్తం ఈ 6 రోజుల్లో 1.17 కోట్ల షేర్ మార్క్ ని ఈ చిత్రం అందుకుంది. ఇలా సాలిడ్ వసూళ్లతో అయితే ఈ రెండు చిత్రాలు అదరగొడుతున్నాయి.

సంబంధిత సమాచారం :