“సార్” పై రివ్యూ ఇచ్చిన “సీతా రామం” దర్శకుడు.!

Published on Feb 25, 2023 10:02 am IST


లేటెస్ట్ గా టాలీవుడ్ లో రిలీజ్ కి వచ్చిన మరో బ్యూటిఫుల్ చిత్రం “సార్”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటుగా ప్రేక్షకుల నుంచి మంచి వసూళ్లు కూడా రాబడుతుంది. ఇక ఈ సినిమాపై అయితే లేటెస్ట్ మరో క్లాసిక్ దర్శకుడు హను రాఘవపూడి తన రివ్యూ ని అందించారు.

గత ఏడాది “సీతా రామం” అనే బ్యూటిఫుల్ మూవీ ని ఇచ్చిన ఈ దర్శకుడు సార్ విషయంలో మేకర్స్ ని కొనియాడారు. సార్ చిత్రం నా ఊహాతీతంగా ఉంది అని ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి అని ధనుష్ గారు తన నటనతో కట్టిపడేసారు వెంకీ అట్లూరి రైటింగ్ గాని స్క్రీన్ ప్లే గాని చాలా హానెస్ట్ గా ఉన్నాయని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారికి మంచి సినిమా ఇచ్చినందుకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నానని అయితే తాను తెలిపారు. దీనితో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :