ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “సీతా రామం” హిందీ.!

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “సీతా రామం” హిందీ.!

Published on Nov 18, 2022 8:09 AM IST

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర ఎందుకో ఎప్పుడూ లేనిది ఓ బ్యాడ్ ఫేస్ నడుస్తున్న సమయంలో అత్యవసరంగా హిట్ కావాల్సి వచ్చినప్పుడు వచ్చిన భారీ హిట్ సినిమా “సీతారామం” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ క్లాసిక్ హిట్ చిత్రం ఈ ఏడాదిలో ఓ మంచి హిట్ గానే కాకుండా టాలీవుడ్ నుంచి ఓ బెస్ట్ వర్క్ గా కూడా నిలిచింది.

దీనితో ఈ చిత్రం విజయం ఇండియన్ సినిమా దగ్గర ఆసక్తిగా మారగా నెక్స్ట్ హిందీ మార్కెట్ లో కూడా రిలీజ్ అయ్యింది. అయితే హిందీలో కూడా ఉన్నన్ని రోజులు డీసెంట్ వసూళ్లు అందుకుంది. కానీ అప్పుడు హిందీలో పలు భారీ సినిమాలు కూడా ఉండడం వల్ల ఎక్కువ రీచ్ కాలేకపోయింది.

కానీ ఇప్పుడు ఈ క్లాసిక్ ని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ వారు ఈరోజు నుంచి హిందీ వెర్షన్ లో స్ట్రీమింగ్ కి తీసుకువచ్చారు. దీనితో సోషల్ మీడియాలో ఆల్రెడీ సినిమా ట్యాగ్ ట్రెండింగ్ గా నిలిచింది. మరి ఇప్పుడు హిందీ ఆడియెన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఈ చిత్రానికి వస్తుందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు