యూఎస్ లో నాన్ స్టాప్ గా “సీతా రామం” వసూళ్ల హవా..!

యూఎస్ లో నాన్ స్టాప్ గా “సీతా రామం” వసూళ్ల హవా..!

Published on Aug 17, 2022 9:00 AM IST

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన పలు మెమొరబుల్ హిట్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ లు హీరో హీరోయిన్స్ గా దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కించిన అద్భుతమైన క్లాసిక్ “సీతా రామం” కూడా ఒకటి. టాక్ తో పాటు వసూళ్లు భారీ లెవెల్లో సొంతం చేసుకుంటున్న ఈ చిత్రం ఒక క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మరి ఈ సినిమా వసూళ్లు అయితే తెలుగు స్టేట్స్ సహా ఓవర్సీస్ లో కూడా ఎక్కడా ఆగడం లేదని చెప్పాలి. లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1.1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి మరింత స్ట్రాంగ్ గా నిలబడుతుంది. దీనితో ఈ చిత్రం మాత్రం ఇప్పుడప్పుడే ఆగేలా లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో రష్మికా మందన్నా కూడా కీలక పాత్రలో నటించగా స్వప్న సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు