“సీతా రామం” సెన్సేషన్..యూఎస్ లో భారీ మార్క్ కి దగ్గరలో.!

Published on Aug 14, 2022 11:21 am IST

ఈ ఏడాది టాలీవుడ్ దగ్గరకి వచ్చిన లేటెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన “సీతా రామం” కూడా ఒకటి. అయితే ఈ సినిమాకి జరిగిన బిజినెస్ చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేసినా ఈ చిత్రం మాత్రం అంచనాలు మించి అదరగొట్టింది.

ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో అయితే సాలిడ్ వసూళ్లతో 7లక్షల డాలర్స్ టార్గెట్ ను సునాయాసంగా కొట్టి ఇప్పుడు 9 లక్షల 25వేల డాలర్స్ మార్క్ దగ్గరకి చేరింది. దీనితో సెన్సేషనల్ మార్క్ 1 మిలియన్ క్లబ్ లో ఈ చిత్రం డెఫినెట్ గా చేరడం ఖాయం అయ్యిపోయింది. మొత్తానికి అయితే ఈ చిత్రం ఓ క్లాసికల్ హిట్ గా నిలిచిపోయింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో రష్మికా మందన్నా, సుమంత్ తదితరులు నటించగా స్వప్న సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :