యూఎస్ లో “సీతా రామం” సెన్సేషన్..లేటెస్ట్ వసూళ్ల వివరాలు.!

యూఎస్ లో “సీతా రామం” సెన్సేషన్..లేటెస్ట్ వసూళ్ల వివరాలు.!

Published on Aug 11, 2022 10:00 AM IST

గత వారం టాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి చిత్రాల్లో రెండిటికి రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అయితే వాటిలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ మరియు నటి మృణాల్ ఠాకూర్ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ చిత్రం “సీతా రామం” ఓ రకంగా రిలీజ్ కి ముందే ట్రేడ్ వర్గాలకి షాకిచ్చింది. తెలుగు సహా ఓవర్సీస్ మార్కెట్ జరుపుకున్న బిజినెస్ నే షాకింగ్ అనుకుంటే..

ఆ మొత్తాన్ని కూడా సునాయాసంగా వసూలు చేస్తుండడం మరింత ఆసక్తిగా మారింది. మరి రీసెంట్ గానే యూఎస్ లో పెట్టుకున్న 7 లక్షల డాలర్స్ భారీ టార్గెట్ ని క్రాస్ చెయ్యడమే కాకుండా ఇప్పుడు ఏకంగా 8 లక్షల డాలర్స్ మార్క్ ని టచ్ చేసి 1 మిలియన్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది. మొత్తానికి అయితే ఈ చిత్రం మాత్రం ఒక మ్యాజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా స్వప్న సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు