హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో “సీతా రామం”

Published on Aug 8, 2022 11:32 am IST

దుల్కర్ సల్మాన్ యొక్క తాజా తెలుగు చిత్రం సీతా రామం టిక్కెట్ విండోల వద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో స్లో అయ్యే మూడ్‌లో లేదు. ఈ సినిమా ఇప్పటికే హాఫ్ మిలియన్ ($500) మార్క్‌ను దాటేసింది. రానున్న రోజుల్లో కలెక్షన్లు భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

గత 2 నెలల్లో యుఎస్ బాక్సాఫీస్ వద్ద బాగా రాణించిన ఏకైక చిత్రం సీతా రామం మాత్రమే. ఈ రేజ్ ఇలాగే కొనసాగితే 3 – 4 రోజుల్లో సినిమా 1 మిలియన్ డాలర్లు దాటడం సులువు అవుతుంది. ఈ రొమాంటిక్ పీరియాడికల్ డ్రామాలో రష్మిక మందన్న కీలక పాత్ర పోషించింది. స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రంలో భూమిక, తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతం వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందించారు.

సంబంధిత సమాచారం :