ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ లా “మిస్టర్ బచ్చన్” లేటెస్ట్ సాంగ్

ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ లా “మిస్టర్ బచ్చన్” లేటెస్ట్ సాంగ్

Published on Jul 10, 2024 11:33 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే “మిస్టర్ బచ్చన్”. మరి హిందీ చిత్రం రైడ్ కి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ అయితే మంచి హైప్ ఇస్తూ వస్తున్నా ఫస్ట్ సింగిల్ ని ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ కి తీసుకొచ్చారు.

సితార్ అంటూ సాగే ఈ సాంగ్ ని హరీష్ శంకర్ కి ఎంతో ప్రత్యేకమైన సాహిత్య రచయిత సాహితి గారు రచించగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. అయితే ఈ సాంగ్ అటు లిరిక్స్ ఇటు పర్ఫెక్ట్ బీట్స్ తో అయితే వినేందుకు ఎంతో ఇంపుగా ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ లా అనిపిస్తుంది అని చెప్పాలి. అలాగే సాంగ్ లో చూపించిన లొకేషన్స్ కానీ రవితేజ, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది.

ఇంకా వారి కాస్ట్యూమ్స్ కూడా సాంగ్ లో బాగున్నాయి. మొత్తానికి అయితే మేకర్స్ మంచి సాంగ్ నే ఆడియెన్స్ కి అందించారు అని చెప్పాలి. ఇక మిక్కీ నుంచి మిగతా ఆల్బమ్ కూడా ఇదే రేంజ్ లో ఉంటుందో లేదో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్ట్ 15న రిలీజ్ కి తీసుకురాబోతున్నారు.

లిరికల్ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు