తన గ్రాండ్ ఫాదర్ కృష్ణ పై సితార ఎమోషనల్ నోట్!

తన గ్రాండ్ ఫాదర్ కృష్ణ పై సితార ఎమోషనల్ నోట్!

Published on Nov 16, 2022 6:05 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నిన్న మృతి చెందగా, ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో దివంగత లెజెండ్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. మహేష్ బాబు కుమార్తె, కృష్ణ మనవరాలు సితార, తన తాత గురించి భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు.

ఆమె ఇలా రాసింది, “వీక్ డే భోజనం మళ్లీ ఎప్పటికీ ఉండదు. మీరు నాకు చాలా విలువైన విషయాలు నేర్పించారు. ఎల్లప్పుడూ నన్ను నవ్వించారు, ఇప్పుడు మిగిలి ఉన్నది మీ జ్ఞాపకం. మీరు నా హీరో, ఏదో ఒక రోజు నేను మిమ్మల్ని గర్వపడేలా చేయగలనని ఆశిస్తున్నాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తాత గారూ” అని పేర్కొంది. సితార తన తాతతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. చివరిసారిగా తాతయ్యను చూస్తుంటే భావోద్వేగానికి గురైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు