మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టిన “సితార ఎంటర్ టైన్మెంట్స్”

Published on Nov 6, 2021 1:24 am IST


భిన్న కథాంశాలతో సినిమాలు నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ మరొక ఇట్రస్టింగ్ స్టోరీ తో మన ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. తాజాగా సితార ఎంటర్ టైన్మెంట్స్ మరొక చిత్రాన్ని ప్రకటించారు. తామర అంటూ చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రఫీ రవి కే. చంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఇది తమ మొదటి ఇంటర్ నేషనల్ చిత్రం అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి సూర్య దేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ బ్యానర్ నుండి విడుదల అయిన వరుడు కావలెను చిత్రం ప్రస్తుతం థియేటర్ల లో ప్రదర్షితం అవుతుంది. అంతేకాక పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లతో భీమ్లా నాయక్ ఈ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More