వైరల్ వీడియో : మహేష్ బాబు ‘అతడు’ సాంగ్ కి సితార పాప అదరగొట్టే డ్యాన్స్

Published on Jan 30, 2023 7:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రిష హీరోయిన్ గా జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 2005 లో మురళి మోహన్ నిర్మించిన ప్రతిష్టాత్మక మూవీ అతడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈమూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ యాక్టింగ్ తో పాటు త్రివిక్రమ్ అత్యద్భుత టేకింగ్ ఈ మూవీని పెద్ద సక్సెస్ చేసాయి. ఇక ఈమూవీలో సాంగ్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ఇందులో త్రిష పెర్ఫార్మ్ చేసే పిల్ల గాలి అల్లరి సాంగ్ యూత్ ని మరింతగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ ని శ్రేయ ఘోషల్ సూపర్ గా పాడగా త్రిష డ్యాన్స్ కూడా ఎంతో బాగుంటుంది. ఇక ఈ సాంగ్ కి కొద్దిసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు కూతరు సితార పాప తనదైన స్టైల్లో డ్యాన్స్ అదరగొట్టారు. అచ్చంగా ఆ సాంగ్ లో త్రిష మాదిరిగా స్టెప్స్ అదరగొట్టిన సితార అందరి నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం సితార తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :