వైరల్ పిక్స్ : అమెరికా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర సితార, గౌతమ్ సందడి

Published on Jun 24, 2022 10:30 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట మూవీతో కెరీర్ పరంగా మరొక సూపర్ హిట్ కొట్టి ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లి అక్కడ హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం మొదట జర్మనీ వెళ్లిన మహేష్ ఫ్యామిలీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇక మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత శిరోద్కర్, కుమార్తె సితార, కుమారుడు గౌతమ్ కూడా తరచు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకాభిమానులతో తమ వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకుంటూ ఉంటారు.

గతంలో కూడా పలు వెకేషన్స్ వెళ్లిన సమయంలో అక్కడి ఫోటోలు షేర్ చేసిన సితార, గౌతమ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం అమెరికాలోని ప్రముఖ కట్టడమైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర తమ స్నేహితులతో కలిసి సందడి చేసారు. ప్రస్తుతం అమ్మ, నాన్నలతో కలిసి మంచి హాలిడే టైం గడుపుతున్నాం అని, ఇందులో భాగంగా నేడు లిబర్టీ స్టాట్యూ దగ్గర అయితే ఫ్రెండ్స్ తో మరింతగా ఎంజాయ్ చేస్తున్నాం అంటూ అక్కడి సమీప నది మీద బోట్ మీద వెళుతూ లిబర్టీ స్టాట్యూ కనిపించేలా దిగిన ఫోటోలను కొద్దిసేపటి క్రితం సితార ఘట్టమనేని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియా అంతటా ఎంతో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :