ఆదికేశవ: సిత్తరాల సిత్రవతీ సాంగ్ రిలీజ్ కి టైమ్ ఫిక్స్!

Published on Sep 8, 2023 7:27 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్ల పై నిర్మిస్తున్న ఈ చిత్రం లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 10 న థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం కి సంబందించిన మ్యూజికల్ ప్రమోషన్స్ ను మేకర్స్ షురూ చేశారు. సిత్తరాల సిత్రావతి సాంగ్ కి సంబందించిన ప్రోమో ను ఇప్పటికే రిలీజ్ చేయగా, రేపు ఉదయం 11:07 గంటలకు పూర్తి పాటని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రం లో జోజు జార్జ్, అపర్ణ దాస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :