మల్టీ స్టారర్ చేసే ఉద్దేశ్యంలో ఉన్న ఆ ఇద్దరు హీరోలు !

1st, November 2017 - 08:55:58 AM

ఒకప్పుడు హీరోలుగా మనంచి గుర్తింపు పొంది ఆ తర్వాత కొంత వెనుకబడిన హీరోలు శివ బాలాజీ, నవదీప్ లు ఈ మధ్య కాలంలో బాగానే లైమ్ లైట్లోకి వచ్చారు. పెద్ద ప్రాజెక్ట్స్ లో మంచి పాత్రలు చేసి నవదీప్ మెప్పిస్తే, అడపాదడపా పెద్ద సినిమాల్లో కనిపిస్తూనే బిగ్ బాస్ సీజన్ వన్ లో విజేతగా నిలిచి శివ బాలాజీ మరోసారి వెలుగులోకి వచ్చారు.

ప్రస్తుతం వీరిద్దరికీ మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాక ఈ ఇద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కలిసి ఒక మల్టీ స్టారర్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మల్టీ స్టారర్ కోసం వీరిద్దరినీ సంప్రదించగా కథ విన్న వీరు ఫైనల్ డెసిషన్ తీసుకునే ప్రాసెస్లో ఉన్నారట. మరి వీరు ఈ మల్టీ స్టారర్ కు ఓకే చెప్తారో లేదో చూడాలి.