‘మావీరన్’ డబ్బింగ్ కంప్లీట్ చేసిన శివకార్తికేయన్

‘మావీరన్’ డబ్బింగ్ కంప్లీట్ చేసిన శివకార్తికేయన్

Published on Jun 6, 2023 12:00 AM IST

ఇటీవల ప్రిన్స్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన యువ నటుడు శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మావీరన్. తెలుగులో మహావీరుడు టైటిల్ తో రిలీజ్ అవుతున్న ఈ మూవీని మడోన్నా అశ్విన్ తెరకెక్కిస్తుండగా అదితి శంకర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. మావీరన్ జులై 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ మూవీలో టాలీవుడ్ కమెడియన్‌ సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శాంతి టాకీస్ బ్యాన‌ర్‌పై అరుణ్ విశ్వ దీనిని గ్రాండ్ గా నిర్మిస్తుండగా భ‌ర‌త్ శంక‌ర్ సంగీతం అందిస్తున్నాడు‌. ఇక శివ‌కార్తికేయ‌న్ మరోవైపు అయలాన్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఆర్‌ రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన అయలాన్ ఫస్ట్‌ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు