మంచి వసూళ్లను రాబడుతోన్న శివ కార్తికేయన్ “డాక్టర్”

Published on Oct 18, 2021 4:00 pm IST

శివ కార్తికేయన్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం డాక్టర్. ఈ చిత్రం ఈ నెల 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. తమిళం లో పాటుగా, తెలుగు లో కూడా విడుదల అయి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కూడా 60 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఉన్నప్పటికీ ఈ తరహా వసూళ్లను రాబట్టడం మంచి పరిణామం అని చెప్పాలి.

ఈ సినిమా కి ప్రమోషన్స్ చాలా ప్లస్ అయ్యాయి అంటూ కొందరు చెబుతున్నారు. డాక్టర్ ఒక మంచి థ్రిల్లర్ మరియు కామెడీ ను కలిగి ఉండటం తో ప్రేక్షకులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. తమిళ ఎగ్జిబిటర్లు కలెక్షన్ల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :