మహేశ్ సినిమాకి పోటీగా తమిళ హీరో శివ కార్తికేయన్ సినిమా..!

Published on Apr 16, 2022 12:22 am IST

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. త‌మిళంతో పాటు తెలుగులో కూడా శివ కార్తికేయన్ సినిమాలు ఏక‌కాలంలో విడుద‌ల‌వుతుంటాయి. గతేడాది ‘వరుణ్ డాక్ట‌ర్’ సినిమాతో మంచి హిట్‌ను అందుకున్న శివ కార్తికేయన్ తాజాగా ‘డాన్’ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. సిబి చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకి తాజాగా విడుద‌ల తేదీని ప్రకటించారు మేకర్స్.

యాక్ష‌న్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మే 13న విడుదల కానున్న‌ట్లు తెలిపారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల కానున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఎస్‌.జే సూర్య కీల‌కపాత్ర‌లో న‌టించ‌నున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ప్రచార చిత్రాలు, టీజ‌ర్ గ్లింప్స్ సినిమాపై అంచ‌నాలలను పెంచేసాయి.

ఇదిలా ఉంటే ఈ చిత్రం విడుద‌ల‌కు ఒక‌రోజు ముందు మ‌హేష్‌బాబు న‌టించిన “స‌ర్కారు వారి పాట” విడుద‌ల కానుంది. మ‌రి మహేశ్ “స‌ర్కారు వారి పాట” పోటీని త‌ట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో శివ కార్తికేయన్ నటించిన “డాన్” సినిమా ఎంతవరకు నిలుస్తుందో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :