తన “డాన్” సినిమాపై అందరికీ ఒక క్లారిటీ ఇచ్చిన శివ కార్తికేయన్.!

Published on May 8, 2022 7:04 am IST

కోలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “డాన్” తన కెరీర్ లో “డాక్టర్” లాంటి సాలిడ్ హిట్ తర్వాత రాబోతుండడం తో అందరిలో మంచి అంచనాలు అలాగే ఆసక్తి గా మారింది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన ఈ సినిమాపై నిన్న జరిగినటువంటి ఫంక్షన్ లో అభిమానులు అందరికీ అసలు ఈ సినిమా కాన్సెప్ట్ పై ఒక క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమా టైటిల్ డాన్ కాగా అందరిలో ఈ సినిమా లో ఎక్కడో మాఫియా షేడ్స్ కూడా ఉంటాయేమో అని నిన్నటి వరకు భావించారు. కానీ అసలు ఈ సినిమాలో అలాంటి మాఫియా టచ్ ఏమీ ఉండదు అని కేవలం తన రోల్ ని తన కాలేజ్ లో తోటి స్టూడెంట్స్ డాన్ అని పిలుస్తారని క్లారిటీ. దీనితో ఇన్ని రోజులు నుంచి ఈ సినిమా థీమ్ పై ఒక అంచనా పెట్టుకున్న అభిమానులకి ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాకి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే మే 13న ఈ చిత్రం తమిళ్ మరియు తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం :