రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’

Published on Oct 4, 2022 7:43 pm IST


కోలీవుడ్ నటుడు యువ కార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ప్రిన్స్. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీని ద్విభాషా సినిమాగా శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ఎల్‌పి, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శాంతి టాకీస్ బ్యాన‌ర్‌లు సంయుక్తంగా భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. శివ కార్తికేయన్‌కు జోడీగా మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ విలక్షన నటుడు సత్యదేవ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ లోని రెండు సాంగ్స్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఈ మూవీని అక్టోబర్ 21న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు అనుదీప్ ఈ మూవీని తెరకెక్కించారని, తప్పకుండా రిలీజ్ తరువాత ప్రిన్స్ మంచి విజయం అందుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది యూనిట్.

సంబంధిత సమాచారం :