తెలుగు ప్రేక్షకులకు శివ కార్తికేయన్ థాంక్స్!

Published on Oct 20, 2021 1:30 pm IST

శివ కార్తికేయన్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం వరుణ్ డాక్టర్. శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శివ కార్తికేయన్ నిర్మించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం తమిళం లో మాత్రమే కాకుండా, తెలుగు లో కూడా డబ్ చేయబడింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ తో దూసుకు పోతుంది.

ఈ చిత్రం విజయం లో తెలుగు ప్రేక్షకులు సైతం కీలక పాత్ర పోషించడం పట్ల హీరో శివ కార్తికేయన్ సోషల్ మీడియా ద్వారా థాంక్స్ తెలిపారు. ప్రేక్షక మహాశయులు అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని అన్నారు. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందించిన ఈ చిత్రం విజయం సాధించడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :

More