శివ కార్తీకేయన్ తో మరో తెలుగు డైరెక్టర్ ?

Published on Mar 26, 2023 2:20 am IST

రాధే శ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తమిళ హీరో శివ కార్తీకేయన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా శివ కార్తీకేయన్ కి రాధాకృష్ణ కుమార్ ఓ కథ చెప్పాడని, శివ కార్తీకేయన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే, నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్, శివ కార్తీకేయన్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ను – శివ కార్తీకేయన్ ను కలిపింది యూవీ క్రియేషన్స్ అని టాక్ నడుస్తోంది. మరి శివ కార్తీకేయన్ ఇమేజ్ కోసం రాధాకృష్ణ కుమార్ ఎలాంటి కథ రాశాడో చూడాలి. నిజానికి శ్రీకాంత్ అడ్డాల శివ కార్తీకేయన్ తో సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా రాధాకృష్ణ కుమార్ పేరు వినిపిస్తోంది. శివ కార్తీకేయన్ అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని రాధాకృష్ణ కుమార్ ఫీల్ అయ్యాడు. శివ కార్తీకేయన్ తన కొత్త ప్రాజెక్టు పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తాడట.

సంబంధిత సమాచారం :