శివకార్తికేయన్ ‘మహావీరుడు’ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on May 5, 2023 7:30 pm IST

యువ నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా మడోన్నా అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ మహావీరుడు. తమిళ్ లో మావీరన్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వ గ్రాండ్ గా నిర్మించారు. భరత్ శంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్, మిస్కిన్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ ని ఆగష్టు 11న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన యూనిట్, దానిని ప్రీ పోన్ చేస్తూ తమ మూవీని జులై 14న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు.

నిజానికి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఆగష్టు 10న విడుదల కానుందని నిన్న ప్రకటన రావడంతో కొంత ఆలోచన చేసిన మహావీరుడు టీమ్ తమ సినిమాని మరింత ముందుగానే ఆడియన్స్ ముందుకి తీసుకురావడానికి సిద్ధం అయ్యారు. మొత్తంగా తమ అభిమాన నటుడి మహావీరుడు మూవీ లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రీ పోన్ కావడంతో పలువురు శివకార్తికేయన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :