శివ కార్తికేయన్ “వరుణ్ డాక్టర్” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Sep 25, 2021 12:00 am IST


శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వరుణ్ డాక్టర్. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేదీను చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 9 వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను ఈ నెల 26 వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపింది. శివ కార్తికేయన్ మరియు కేజే ఆర్ స్టూడియోస్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగి బాబు, మీలింద్ సొమన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :